మనకు వివిధ దేశాల్లో వివిధ రకాల పాములు ఉన్నాయి. అలా ప్రపంచంలో చాలా పాములున్నాయి. కానీ కొన్ని పాములు కాటేసిన పెద్దగా ఏం జరగదు. కానీ కొన్ని పాములు విషపూరితమైనవి. ఇలాంటివి 600 పాములు ఉన్నాయి. అయితే ఇందులో 200 పాములు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి కాటేస్తే మనిషి ప్రాణం పోతుంది. అయితే ఇంతకంటే ప్రమాదకరమైన పాము కూడా ఉంది. ఆ పాము ఒక్క కాటుకి వంద మంది ప్రాణాలు కోల్పోతారంట. ఆ రకమైన పాములు ఆస్ట్రేలియాలో ఉన్నాయి.
ఆ పామును ఇన్‌ల్యాండ్ తైపాన్ అని అంటారు. ఫియర్స్ స్నేక్ అని కూడా పిలుస్తారు. ఈ పాము తల దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఈ పాము ఉదయం వేల చాలా యాక్టివ్‌గా ఉంటుందంట. దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇక దీని విషం గురించి మాట్లాడుకుంటే.. ఇన్‌ల్యాండ్ తైపాన్ పాము విషం చాలా ప్రభావంతమైదని యూనివర్సిటీ ఆప్ బ్రిస్టల్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ వెబ్‌సైట్‌లో వెల్లడించారు.
ఈ పాముల విషాన్ని ఎల్డీ50 స్కేల్ రూపంలో కొలుస్తారు. ఇన్‌ల్యాండ్ తైపాన్ పాము ఒక్కసారి 110 మిల్లీగ్రాముల విషాన్ని విసర్జిస్తుందట. అంటే ఒక్క కాటుతో దాదాపు 100 మందిని చంపేందుకు ఆస్కారం ఉంటుందన్న మాట. లేదా రెండు లక్షల 50 వేల ఎలుకలు మరణించే అవకాశం ఉంది. ఈ పాము ఆస్టేలియా వెలుపలి ప్రాంతాల్లో కనిపించదు. తైపాన్ సాధారణంగా అడవిలో కనిపిస్తుంది. అడవులను సందర్శించే వారికి ఉదయంపూట నేలపై కనిపిస్తుందంట.
ఈ పాములో ఇంకొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. పగటి పూటి ఈ పాములు కనిపించడం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్లాండ్ తైపాన్ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుంది. వీటి కోరలు 3.5 నుంచి 6.2 మిల్లిమీటర్లు పొడవు ఉంటాయి. అంతేకాదు ఈ పాములు రుతువులను బట్టి చర్మం రంగును మార్చుకుంటాయంట. చలికాలంలో ముదురు గోధుమ రంగులో ఉండే ఈ పాము... వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తాయట. కోడి పిల్లలను, ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయట.