ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని హిరమండలం మండల ప్రత్యేకా ధికారి ఆర్. కిశోర్ సూచించారు. గురువారం కొండరాగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ మేరకు సంబంధిత రైతులతో మాట్లాడుతూ దళారుల బారిన పడకుండా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుంటుంద న్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు ధాన్యం విక్రయించిన 21 రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. రైతులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు గాను నేరుగా రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ చేపడుతున్నామన్నారు. మండల వ్యవసాయాధికారి బి. సంధ్య మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి ఇప్పటి వరకు 7, 250 క్వింటాళ్ల ధాన్యం సేకరించామని తెలిపారు. రానున్న రోజుల్లో ధాన్యం కొను గోలును వేగవంతం చేయనున్నామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ బెహరా మురళీ మోహన్, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.