దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న బీఆర్ఎస్ వివిధ రాష్ట్రాల్లో నేతలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఇదిలావుంటే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అడుగులు ఎటు వైపు కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. రాజకీయ భవిష్యత్‌పై స్పందించిన ఆయన.. విశాఖ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఏ పార్టీ తరపున అనేది మాత్రం చెప్పలేదు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా కూడా బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని రెండు, మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందించారు.. క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.
తాను ఆప్, జనసేన పార్టీలో చేరతానంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది అన్నారు లక్ష్మీనారాయణ. తాను బీఆర్‌ఎస్‌లో చేరతానని కూడా ప్రచారం చేశారని.. కొందరు సెన్సేషన్ కోసం.. అలాగే యూ ట్యూబ్ ఛానళ్లు ఇలా చేస్తున్నాయన్నారు. వారికి వ్యూస్ ఎలా వస్తాయి.. జేడీ వ్యవసాయం చేస్తున్నారంటే వ్యూస్ రావు.. అదే ఆప్ , జనసేన పార్టీ, బీఆర్ఎస్ లో చేరతారంటే వ్యూస్ వస్తాయంటూ ఛమత్కరించారు. ఇవన్నీ కొందరు ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేస్తున్నవే అన్నారు. ఇప్పటికే తాను పోటీపై క్లారిటీ ఇచ్చానని గుర్తు చేశారు.
కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అన్నారు. తన ఆలోచనలతో పార్టీలు ఏకీభవిస్తే వాళ్లతో మాట్లాడతానని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇండిపెండెంట్‌గా పోటీచేస్ ఆప్షన్ ఉందని గుర్తు చేశారు. విశాఖ ప్రజలు గత ఎన్నికల్లో తనను ఆదరించారని.. అందుకే అక్కడే పోటీ చేస్తాను అన్నారు. తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఏకీభవించే పార్టీవైపు వెళతాను అన్నారు. అవసరం లేదనుకుంటే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనం నిబంధనలకు విరుద్దంగా ఉంటే రవాణాశాఖ అనుమతి ఇవ్వదు కదా అన్నారు లక్ష్మీనారాయణ. వాస్తవానికి అంబులెన్సుకు వేసే కలర్ ఓ కోడ్ ఉందన్నారు.. ఏపీలో అంబులెన్స్‌లకు కలర్ వేరేగా ఉందన్నారు. గతంలో ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేశారని గుర్తు చేశారు. అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని.. ప్రజల సెంటిమెంట్, ఎమోషన్స్‌ను వాడుకుని మనం రాజకీయం ఎలా చేస్తున్నారన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్నారు.
అమెరికాలో కూడా అధ్యక్ష ఎన్నికలు అయ్యాక ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. ప్రజల సెంటిమెంట్‌తో కొట్టాలి.. అందుకే ఇలాంటివి అన్నారు. నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలపై చర్చ పెట్టొచ్చు కదా అన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారన్నారు.. సమస్యలపై ఎవరూ స్పందించడం లేదన్నారు. ఈ ధోరణి మారాలన్నారు.
చట్టంలో కూడా అనేక మార్పులు వచ్చాయన్నారు సీబీఐ మాజీ జేడీ. 166 A సెక్షన్ వచ్చిందని.. విచారణలో ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఫాలో కాకపోతే పోలీసులపై కేసులు పెట్టొచ్చన్నారు. మహిళల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడం కోసం పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదని.. మహిళల్ని సాక్షులుగా పరిగణిస్తే వాళ్ల ఇంటికి వెళ్లాలన్నారు. 15 ఏళ్ల లోపు వాళ్లను.. 65 ఏళ్లు దాటిన పెద్దవాళ్లను పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదన్నారు. వాళ్లు ఉన్నచోటికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకోవాలన్నారు.
ఒకవేళ మహిళలు ఫిర్యాదు చేయడానికి వస్తే మహిళా పోలీసు అధికారి ఉండాలన్నారు. చట్టాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేదన్నారు లక్ష్మీనారాయణ. చట్టాల ఉల్లంఘన జరిగినా ఎవరికీ తెలియడంలేదని.. సివిల్ కేసుల్లో పోలీసులకు సంబంధం లేదన్నారు. కానీ మీడియా, ఎన్జీవోలు, హ్యూమన్ రైట్స్ యాక్టివ్‌గా ఉన్నాయని.. ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారన్నారు.