జమిలి ఎన్నికల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మరో్సారి కేంద్రం స్పష్టంచేసింది. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్నికలంటే భారీ వ్యయంతో కుదురుకున్న వ్యవహారం అని అభిప్రాయపడింది. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే చాలా మొత్తం ఆదా అవుతుందని పార్లమెంటులో ప్రస్తావించింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. దాంతో, దేశంలో మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.
ఎన్నికల సంస్కరణలపై ఏర్పాటు చేసిన లా కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా జమిలి ఎన్నికలను ప్రస్తావించిందని రిజిజు తెలిపారు. పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్ సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించిందని చెప్పారు. ఇలా ఒకేసారి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీఆ ఆదా అవ్వడంతో పాటు అధికార యంత్రాంగంపై భారం తగ్గుందని చెప్పారు. నిత్యం ఏదో ఒక చోట ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సుదీర్ఘంగా అమలు చేయాల్సి వస్తోందన్నారు. దీనివల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాన్ని జమిలి ఎన్నికలతో నిరారించవచ్చని రిజిజు తెలిపారు.