ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతీ పేదవారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం పుర్కరించుకొని కోటబొమ్మాలి కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మంగళవారం దువ్వాడ బహుమతులు అందజేశారు. అలాగే మండల పరిషత్ అవరణంలో, వెలుగు కార్యాలయం సిబ్బంది, ప్రకాష్ నగర్ కాలనీ మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమతులను అందజేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మండల పరిషత్ ఉపాధ్యాక్షుడు దుక్క రోజా రామక్రిష్ణ, కొత్తపేట వైఎస్సార్సీపీ నాయకులులో కలిసి కొత్తపేట కొత్తమ్మతల్లి ఆలయంలో దువ్వాడ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ కార్యక్రమాల్లో పిఎసిఎస్ అధ్యక్షుడు బాడాన మురళి, ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్, జిల్లా రైతు భరోసా అడ్వైజర్ కమిటి సభ్యుడు కవిటి రామరాజు, వైఎస్సార్స్పీ నాయకులు కాళ్ళ సంజీవరావు, గడ్డవలస నాగభూషణరావు, జి. కేశవరావు, నూక సత్యరాజు, సుంకరి జనార్థనరావు, స్థానిక ఎస్ఐ షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.