బొబ్బిలి గ్రోత్ సెంటర్ భూముల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న మట్టి ను అక్రమ తవ్వకాలపై జిల్లా మైన్స్, విజిలెన్స్ అధికారులు, బొబ్బిలి రెవెన్యూ అధికా రులు మంగళవారం తనిఖీలు నిర్వహిం చారు. విజి లెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ టి. జయ ప్రసాద్, మండల రెవె న్యూ ఇన్స్పెక్టరు కె. కల్యాణచక్రవర్తి, రాయల్టీ ఇన్స్పెక్టరు వి. వెంకట శ్రీనివాసరావు సంయుక్తంగా తనిఖీ చేపట్టారు. ఎ. బూర్జివలస, మెట్టవలస, పనుకువలస, గున్నతోటవలస కోటిచెరువు, గ్రోత్ సెంటరు, రామన్నదొరవలస ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరి గిన ఆనవాళ్లను గుర్తించారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై గట్టి నిఘా పెడతా మని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా తవ్వకాలు జరిపితే తమకు సమాచారం అందివ్వాలని సూచించారు.