కడప జిల్లా, సంబేపల్లె, మండల పరిధిలోని దుద్యాల గ్రామం నాయునివారిపల్లె సమీపంలో నంది విగ్రహం చోరీ కేసులో ఏడుగురిని బుధవారం దుద్యాల చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌యండీ షరీఫ్ తెలిపారు. నాయునివారిపల్లెకు సమీపంలో ఊరికి పడమరగా గత ఆగస్టు నెలలో నంది విగ్రహం చోరీ అయినట్లు తెలిపారు. ఈ కేసులో రాయచోటి పట్టణానికి చెందిన వంగిమళ్ల లక్ష్మిరెడ్డి, సుండుపల్లె మండలం రాయవరం గ్రామానికి చెందిన పాముల శివప్రసాద్, రాయచోటి పట్టణానికి చెందిన షేక్ అబ్బుల్‌ఖయూం, కడప టౌన్‌కు చెందిన నరసింహామూర్తి, దుద్యాల గ్రామం పొట్రిరెడ్డిగారిపల్లెకు చెందిన అమర్‌నాధరెడ్డి, ఊరగాయగుట్టపల్లెకు చెందిన వాదినాల అశోక్, కాలవ మహేంద్రను అరెస్టు చేసినట్లు తెలిపారు. నంది విగ్రహాన్ని సుండుపల్లె- పీలేరు మార్గంలోని చెయ్యేరు నది వద్ద వెతకగా కొన్ని పీసులు లభించినట్లు తెలిపారు. మిగిలిన వాటిని చెయ్యేరులో పడవేసినట్లు తెలియజేశారు. వీరు రామాపురం, వీరబల్లి మండలాల్లో పురాతన విగ్రహాల్లో వజ్రాలు ఉంటాయని స్వామి చెప్పడంతో వాటిని చోరీ చేసి పగలగొట్టినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి బుధవారం రాయచోటి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.