ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న సీఎం, అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ వెళ్తారు. రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. జనపథ్ 1లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నట్టు సమాచారం. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఏపీ అభివృద్ధికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం, విభజన హామీల గురించి ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది.