చైనాతో సహా ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌లో రెండో బూస్టర్ డోసును అనుమతించాలని ఆరోగ్య నిపుణులు విజ్ఞప్తి చేశారు. కరోనా జాగ్రత్తలపై సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఐఎంఏతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డబుల్ బూస్టర్ డోస్ పై (నాలుగో టీకా) ఐఎంఏ నొక్కి చెప్పింది. పలు దేశాల్లో నాలుగో డోసు వేసినా ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో భారత్‌లో డబుల్ బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రిని కోరింది. ఈ సెంకడ్ డోస్ వల్ల ప్రజల్లో నిరోధకత పెరుగుతుందని, వైరస్‌పై పోరాటానికి ఇది పనిచేస్తుందని ఐఎంఏ మాజీ అధ్యక్షుడు జేఏ జయలాల్ చెప్పారు. అలాగే ప్రజలంతా మాస్కలు, శానిటైజర్లు వాడటంతో పాటు సామాజిక దూరం పాటించాలని సూచించారు.