ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో బుధవారం తెల్లవారుజామున 2:19 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో గాఢనిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. 5 కి.మీ లోతులో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఈ రాష్ట్రంలో భూమి కంపించింది. తరచూ విపత్తు రావడంపై ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతకు ముందు నేపాల్ లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది.