భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ మహిమా స్వామికి.. యూరోప్ లో అరుదైన గౌవరం దక్కింది. ప్రతిష్టాత్మక యురోపియన్ మాలిక్యులర్ బయోలాజీ ఆర్గనైజేషన్(ఈఎంబీవో)కు ఆమెను ఎంపిక చేశారు. యూరోప్ లో ఉన్న మేటి బయోలజీ నిపుణుల్లో ఆమెను ఒకరిగా గుర్తించారు. బెంగుళూరుకు చెందిన ఈమె యూనివర్శిటీ ఆఫ్ దుండేలో లైప్ సైన్సెస్ లో నిపుణురాలిగా పని చేస్తున్నారు. అక్కడ ఉన్న పరిశోధనా బృందానికి ఆమె హెడ్ గా ఉన్నారు. పేగుల్లో ఇమ్యునిటీ గురించి ఆ బృందం అధ్యయనం చేస్తోంది.