భీమవరంలో జనవరి 2, 3, 4, తేదీల్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడాపెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పిల్లి ప్రసాద్ విమర్శించారు. ఆరేపల్లి వెంకటనారాయణ అధ్యక్ష తన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం చట్టాలుమార్చి కార్మికులను పెట్టుబడి దారులుకు బానిస లుగా చెయ్యాలని చూస్తుందని విమర్శించారు. కల్లుగీతకార్మిక సంఘం జిల్లా నాయకులు బొంతుశ్రీను మాట్లాడుతూ.. కల్లు గీత ను నాశనం చేసి గీత కార్మికుల పొట్టకొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్నారు. దశలవారీగా మద్యనిషేధం చేస్తామని చెప్పిన మాటలు గాలికొదిలేసారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లానాయకులు ముడేమోజేష్, సీఐటీయూ జిల్లా నాయకులు బి. వెంకట్రావు, గీత సంఘం నాయకులు నార్నివెంకటేశ్వరరావు, దొంగ నాగేశ్వరరావు, దొంగ సింహాచలం, దూబోయిన దుర్గా రావు, తదితరులు పాల్గొని మాట్లాడారు.