రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు అదే స్ఫూర్తితో శృంగవరపుకోట నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు జామి మండలం అలమండ-1 సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కొత్తవలస ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు