కడప జిల్లాలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేటు కార్పోరేట్ జూనియర్ కళాశాలలు ఆన్లైన్ అఫిలియేషన్ దరఖాస్తులు ఈ నెల 30లోగా సమర్పించాలని ఆర్ఐవో రవి పేర్కొన్నారు. కడప ఆర్ఐవో కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..... జిల్లా వ్యాప్తంగా 133 ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో ఇప్పటి వరకు 67 కళాశాలలు అఫిలియేషన్ ప్రక్రియను పూర్తి చేశాయన్నారు. 48 జూనియర్ కళాశాలలు అండర్ ప్రాసె్సలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 18 జూనియర్ కళాశాలలు ఎటువంటి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించలేదని చెప్పారు. ప్రారంభించని కళాశాలల ప్రిన్సిపల్స్ ఆలస్యం చేయకుండా ఈనెల 31లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. లేదంటే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.