గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలైన 26 పథకాలతో ఎంతో మందికి లబ్ధి చేకూరేదని, ఆ పథకాలన్నీ రద్దు చేయడం అన్యాయమని బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్‌నాయుడు విమర్శించారు. గురువారం రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన గాదెల శ్రీనివాసులును శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్టుపోగుల ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి జి.కె.నాగరాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుభద్ర, పట్టణ ఉపాధ్యక్షుడు తోట నగేష్ తదితరులు పాల్గొన్నారు.