గత ప్రభుత్వాల కంటే భిన్నంగా పారదర్శక పాలన చేస్తుంటే ప్రభుత్వంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటి ని తిప్పికొట్టాలని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గుంటూరు బస్టాండు రోడ్డులోని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా కార్యాలయంలో గురువారం పార్టీ కార్పొరే టర్లు, డివిజన్‌లలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మరో కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలంటే ఎక్కువగానే సీఎం జగన్ అమలు చేసి చూపుతున్నారన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.... సంక్షేమ పథకాలతో పాటు పార్టీ ప్రజలకు మరింత చేరువకావటానికి గృహ సారధుల నియామకంతో పథకాల అమలుతీరును పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో మేయర్ కావటి మనోహర్‌నాయుడు, తూర్పు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు అడపా శేషుబాబు, మైనార్టీ సంక్షేమశాఖ సలహాదారు ఎస్‌ఎం జియావుద్దీన్, డిప్యూటీ మేయర్లు డైమండ్‌బాబు, షేక్ సజీల, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, నూరిఫాతిమా, కోలా భవానీ పలువురు కార్పొ రేటర్లు, పార్టీ ముఖ్య నాయకులున్నారు.