గ్రూప్-1 సర్వీసెస్ (జనరల్/ లిమిటెడ్ రిక్రూట్మెంట్) స్ర్కీనింగ్ టెస్ట్ రాయనున్న అభ్యర్థుల హాల్ టికెట్లు ఈనెల 31వ తేదీ నుంచి ఏపీపీఎస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎ్‌ససీ సెక్రటరీ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 8వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1, అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు మొత్తం 18 జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల జాబితాను కూడా కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.