తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం రూ.10 వేలు చెల్లించే శ్రీవాణి ట్రస్టు దర్శన టిక్కెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నూతన సంవత్సరంతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు పది రోజులపాటు ఉండడంతో శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీని నేటి నుండి జనవరి 11 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. జనవరి 12 నుండి యథావిధిగా శ్రీవాణి ట్రస్టు దర్శన టిక్కెట్లను విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.