అధికారంలోకి రాగానే ‘ఫైబర్‌నెట్’ను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది.ఫైబర్ నెట్‌కు రూ.1000 కోట్ల అప్పు ఇవ్వాలని ప్రభుత్వం యూనియన్ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వంతో ఉన్న బలమైన బంధం నేపథ్యంలో యూనియన్ బ్యాంకు ఈ ప్రతిపాదనలను తిరస్కరించే అవకాశం లేదని, రేపోమాపో సొమ్ములు వచ్చేస్తాయని ఆర్థిక శాఖ అధికారులు నమ్ముతున్నారు. ఏపీలోని కార్పొరేషన్లకు అప్పులు ఇవ్వడంపై ఆర్బీఐ ఇదివరకే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. రుణాన్ని సదరు కార్పొరేషన్ ఎందుకు వాడుతోంది? తిరిగి తన నిధులతోనే చెల్లిస్తోందా? ఇవన్నీ పరిశీలించాలని ఆదేశించింది. ఫైబర్ నెట్ విషయంలో ఇవేవీ యూనియన్ బ్యాంకు పాటిస్తున్న దాఖలాలు లేవు. చంద్రబాబు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ఫైబర్‌నెట్’ను జగన్ అధికారంలోకి రాగానే నామమాత్రపు కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి.