రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు అధికార పక్షం పరమైపోతున్నాయి. 33 ఏళ్లపాటుకు లీజు కిచ్చేస్తోంది. తాజాగా కడప, తిరుపతి (కరుకలువ)ల్లో రెండేసి ఎకరాలు, అనకాపల్లి (రాజుపాలెం)లో 1.75 ఎకరాలు, అమలాపురం (జన్నుపల్లి)లో ఎకరం చొప్పున అప్పగించింది. వీటికి ఎకరా లీజు ధర సంవత్సరానికి రూపాయే కావడం విశేషం.