న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబరు 31న అర్ధరాత్రి ర్యాలీలు, రోడ్లపై కేక్ కటింగ్లు చేయకూడదని వన్ టౌన్ సీఐ ఇస్మాయిల్, టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు శనివారం పేర్కొన్నారు. రహదారులపై కేక్ కటింగ్లు చేయడం, కేరింతలు కొడుతూ ద్విచక్రవాహనాలు అతి వేగంగా నడపడం, సైలెన్సర్లు తీసివేసి వాహనాలు నడపడం ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యాపార స్థులు తదితరులు నిర్ణీత సమయానికే మూసివేయాలన్నారు. అనుమతి లేని ప్రాంతాల్లో మద్యం అమ్మడం, ఎక్కడపడితే అక్కడ విక్రయాలు చేపట్టడం లాంటివి చేయరాదన్నారు.