విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం ముఖ్యమంత్రి ప్రథమ ధేయమని మలుగూరు సర్పంచ్ రమేష్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని ఉచితంగా విద్యార్థులకు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్నలక్ష్మి, ఎంపీటీసీ తులసి, స్కూల్ చైర్మన్ వెంకటరమణ వైసిపి నాయకులు పాల్గొన్నారు.