ప్రజాశక్తి గుంతకల్లు: బుద్ధి మాంద్యం గల పిల్లలకు సేవ చేయడంలో ఆత్మ సంతృప్తి ఉందని గుంతకల్లు రెవిన్యూ డివిజన్ అధికారి జె. రవీంద్ర అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్ల ఆర్థిక సౌజన్యంతో పట్టణంలోని ఎంవిఐ కార్యాలయం వెనుక భాగంలో శ్రీ వివేకానంద ఉద్యానవనంలో 42 మంది బుద్ధి మాంద్యం గల పిల్లలకు దుస్తులను ఆర్సీఓ జె. రవీంద్ర అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలోని బుద్ధి మాంద్యం గల పిల్లలకు దుస్తులను అందజేయడం సంతృప్తిగా ఉంద న్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం రోజును వారితో గడపడం దైవ సానిధ్యంలో ఉన్నట్టుగా భావిస్తున్నామన్నారు. అనంతరం ఆ పిల్లలతో కేకు కోయించి తినిపించు కున్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు రెవిన్యూ డివిజన్ పరిధిలోని గుంతక ల్లు, గుత్తి, పామిడి, పెద్దవడుగూరు, యాడికి, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల తహశీల్దార్లు మహబూబ్ బాషా, సునీతా బాయి, ఈరమ్మ, అలెక్జాన్డెర్, బ్రహ్మయ్య, అనిల్ కుమార్ మరియు డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, విఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.