చంద్రబాబు సభలో మరోసారి విషాధం నెలకొంది. ఇటీవల కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రోడ్ షోలో జరిగిన విషాదం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. గుంటూరులో నిర్వహించిన చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సభలో చంద్రబాబు ప్రసంగం ముగిసిన అనంతరం.. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఆ తర్వాత జనాత వస్త్రాలు, సంక్రాంతి కానుకల పంపిణీ జరుగుతున్న క్రమంలో ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. అయితే.. సభా నిర్వాహుకులు సరైన క్రమంలో బారికేడ్లు పెట్టకపోవటం వల్ల.. ప్రజలు ఒక్కసారిగా రావటంతో.. తొక్కిసలాట జరిగింది.
ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రవాసాంధ్రుడు ఈ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సభ కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు వారం రోజులుగా పని చేస్తున్నారు. ఇందుకోసం పెద్దయెత్తున్న ప్రచార కార్యక్రమం కూడా చేపట్టారు. వికాస్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ సభకు సుమారు 30 వేల మంది ప్రజలు వస్తారని అంచనా వేసినా.. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవటమే ఈ తొక్కిసలాటకు కారణమైందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa