నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్‌తో ప్రపంచం, ప్రమాదం అంచున తచ్చాడుతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కార్చిచ్చులు, వరదలు, వేడి గాలుల, చలి, మంచు వణికించాయి. 2023లో కూడా ఇలాంటి కల్లోలాలు తప్పవని పర్యావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. వీటికి తోడు సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల బెంబేలెత్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్యదరా ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనం పర్యావరణవేత్తలందరినీ కలవరపెడుతోంది.