తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లకు డీఏ పెంచుతున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం 34శాతం ఉన్న డీఏను ప్రభుత్వం 38 శాతానికి పెంచింది. ఈ పెంపుతో ప్రభుత్వంపై దాదాపు రూ.2359 కోట్ల అదనపు భారం పడుతుంది. తాజా నిర్ణయంతో సుమారు 16 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులు ఉండగా ఉండాలని స్టాలిన్ కోరారు.