తెలంగాణ మంత్రులపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని, వారు ఏపీని ఏం ఉద్దరిస్తారని అన్నారు. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, శ్రీశైలం, నాగార్జున సాగర్లో దొంగ కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏపీకి రావాల్సిన ఆస్తులు, నిధులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టడం తప్పు కాదని, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని పేర్ని నాని అన్నారు. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారని, బీఆర్ఎస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చన్నారు. ఏపీలో కాంగ్రెస్, సీపీఐతోనే బీఆర్ఎస్ పోటీ పడుతుందని అన్నారు.