ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాతీయ రహదారిపై ఘోరం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని గోవింద్నగర్కు చెందిన చరణ్ నర్వారియా(30) అనే యువకుడిని, ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించకపోగా, అనేక వాహనాలు మృతదేహంపై నుంచే వెళ్లటంతో బాడీ నుజ్జునుజ్జు అయి, దాదాపు 100 మీటర్ల మేర ముక్కలుగా చెల్లాచెదురుగా పడిపోయింది. సోమవారం ఉదయం ఓ వ్యక్తి సమాచారం మేర అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం మృతుడి కుటుంబీకులకు సమాచరమిచ్చారు.