‘మీ తాత రాజారెడ్డి రాజ్యాంగం, మీ ముత్తాత పని చేసిన బ్రిటిషోళ్ల చట్టాలు అమలు చేస్తానంటే కుదరదు జగన్‌రెడ్డీ! ఇది నీ ఫ్యాక్షన్ స్వామ్యం కాదు.. ప్రజాస్వామ్యం. అర్ధరాత్రి గుడ్డిగా ఓ చీకటి జీవో ఇచ్చేశావు. తెల్లారేసరికి ఆ జీవోలో నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై షో చేశావు. నీ ప్రచార పిచ్చి ఓ అవ్వ ప్రాణాల మీదకొచ్చింది. ఆ అవ్వ తీవ్రంగా గాయపడటానికి కారకుడైన నీపై మర్డర్ కేసు బుక్ చేయాలి. సభకు అనుమతి ఇచ్చినవారిని విచారించాలి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.