దేశరాజధాని ఢిల్లీలో మహిళలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే కారుతో ఓ యువతిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన మరవక ముందే మరో సంఘటన సంచలనంగా మారింది. పాడవనగర్ లో రోడ్డుపై వెళ్తున్న యువతిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. కారులో ఎక్కకుంటే యాసిడ్ పోస్తామని బెదిరించినట్లు సమాచారం. అయినా యువతి కారు ఎక్కకపోవడంతో బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. ఈ పెనుగులాటలో యువతికి గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.