వైసీపీ పార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని నియమించింది. మంగళవారం సంభవించిన ఈ పరిణామాలు వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్నచోట్ల వారే ఆయా నియోజకవర్గాలకు ఇంఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. వెంకటగిరిలో మాత్రం ఎమ్మెల్యేని తప్పించి ఆ స్థానంలో రామ్‌కుమార్‌రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడం కలకలం రేపింది. అధిష్ఠానం ప్రకటనతో నియోజకవర్గవ్యాప్తంగా నేదురుమల్లి వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో ఆనం వర్గీయులు అయోమయంలో పడిపోయారు.