కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో చోటుచేసుకున్న మరణాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే కుప్పం టూర్లో చంద్రబాబు గొడవలు సృష్టిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు లా అండ్ ఆర్డర్ అంటే అస్సలు గౌరవం లేదని, ప్రతిపక్ష నేత హోదాలో ఉండి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. రోడ్డు షోలు, రహదారులపై మీటింగ్‌కు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా పోలీసులపైనే దాడి చేశారన్నారు. కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్‌కు చంద్రబాబే కారణమన్నారు.