ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 05:14 PM

పబ్లిసిటీ పిచ్చితో 40 మందిని బ‌లితీసుకున్న చంద్ర‌బాబు.. నైతిక బాధ్యతగా రాజకీయాల నుంచి వైదొలగడమే మంచిదని అన్న‌మ‌య్య జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఎమ్మెల్యే  గ‌డికోట‌ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చంద్రబాబు నాయుడు దాడులు చేయించడంపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన సంఘటనలు, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు చట్టాలను తీసుకొస్తాయని, ఆ చట్టాలను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కానీ, దేశంలోనే సీనియర్ రాజకీయ నేతగా చెప్పుకునే చంద్రబాబు.. చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్ర‌శ్నించారు. 14 సంవత్సరాలు సీఎంగా, 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్ర‌బాబు అల్లర్లు, గొడవలను ప్రేరేపిస్తూ పోలీసులపై దాడులు చేయించడం ఎంతవరకు న్యాయమని నిల‌దీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com