కుప్పంలో ఓటు హక్కు కూడా లేని చంద్రబాబుకు కుప్పం మీద ప్రేమ ఉందా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఇలా అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయిన చంద్రబాబుకు కుప్పంలో ఏం పని అని ప్రశ్నించారు. అనుమతులు తీసుకోకుండా రోడ్డు షోలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు. అమాయకులు బలవుతుంటే త్యాగం చేశారని అంటున్నాడని, బాబు కోసం త్యాగం ఎవరు చేయాలి. ఎందుకు చేయాలి..? అని ప్రశ్నించారు. నడిరోడ్డుపై సభలు పెట్టి ప్రజలను బలితీసుకోవడం సమంజసమా..? అని ప్రశ్నించారు.