మధ్యప్రదేశ్ రీవా నగరంలోని ఎయిర్ స్ట్రిప్ పై గురువారం ఓ ట్రైనింగ్ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చోర్ హటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రీ గ్రామంలో ఓ ఆలయ గోపురాన్ని ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.