చైనాపై ఆధారపడ్డ పాకిస్తాన్ కూడా శ్రీలంక లాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాక్ విలవిల్లాడుతోంది. ఇంధన పొదుపు కోసం దేశంలో విద్యుత్ వాడకంపై ఆంక్షలు విధించారు. బల్బులు, ఫ్యాన్ల తయారీపై నిషేధం విధించి, కార్యాలయాల్లో 30శాతం విద్యుత్ వాడకాన్ని తగ్గించారు. దీంతో 600కోట్లు ఆదా చేస్తామని ప్రభుత్వ అంచనా. మరోవైపు అమెరికాలోని పాత రాయబార కార్యాలయాలను పాక్ అమ్మకానికి పెట్టింది.