‘మా పవన్ కల్యాణ్ సీఎం అవుతాడు’.. అని గొంతు చించుకుని అరిచే వాళ్లంతా ఇప్పుడు పవన్‌ను ను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని, ‘అయ్యా.. మీరిద్దరూ కలిసి 2024లో కలిసి పోటీ చేస్తున్నారా..? లేదా..?. గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి..? అని జనసేన కార్యకర్తలంతా పవన్‌ను ప్రశ్నించాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. ఏదో మీడియాలో పెద్ద కవరేజీ కోసం వారిద్దరి ఆరాటమే తప్ప, వారిద్దరి కలయికలో పెద్ద పస ఏమీ లేదన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు పవన్ మాతోనే ఉన్నాడని ఇప్పటిదాకా చెప్పారని, మరోవైపు పవన్ కూడా బీజేపీతో మిత్రపక్షమని చెప్పాడని, మరి, బీజేపీతో ఉండాల్సిన పవన్ మరోవైపు చంద్రబాబుతో ఎందుకు ఉంటున్నాడు..? ఇది నైతికమేనా..? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.