సంక్రాంతి ప్యాకేజీ కోసమే పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పవన్ కల్యాణ్‌కు నిజంగా బుద్ధి ఉంటే కందుకూరు, గుంటూరులో చంద్రబాబు సభల్లో చనిపోయిన 11 మంది కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లేవాడన్నారు. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు ఇంటికి పరామర్శకు వెళ్లడం ఏమిటి?. పవన్‌కల్యాణ్ అనే ప్యాకేజీ స్టార్‌కి బుద్ధి ఉందా..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు, పవన్‌కు సిగ్గు, శరం ఏనాడో పోయాయని, వాళ్లిద్దరూ నైతిక విలువలను ఏనాడో వదిలేశారన్నారు. ‘నాకు ఎన్ని సీట్లు ఇస్తావు?. నాకు ఎంత ప్యాకేజీ ఇస్తావు? నేను ఏయే స్థానాల్లో అమ్ముడుపోవాలి?’ అని దత్తతండ్రిని అడగడానికి దత్తపుత్రుడు వెళ్లిన భేటీనే తప్ప, మరొకటి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా సంతోషంగా ఉంటే.. పవన్, చంద్రబాబు ఇద్దరూ చీకటి ఒప్పందాలతో ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలని కుయుక్తులు పన్నుతున్నారన్నారు. వీరిద్దరికి తోడు పచ్చమీడియా కుట్ర చేస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరని, మొత్తం 175కు 175 సీట్లు గెల్చుకుంటామని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.