పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణం విడుదల చేయాలని, సర్పంచులతో సంబంధం లేకుండా వేతనాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 680 ప్రకారం వేతనాలు పెంచి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు సత్యమూర్తి దాసరి చంద్ర రమాదేవి మోహన, గ్రీన్ అంబాసిడర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్ర సహాయ కార్యదర్శులు యేసు పాదం కృష్ణయ్య చంద్రబాబు చెంచురామయ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa