ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని సారా తయారీ కేంద్రా లపై ఎస్పీ జీఆర్ రాధిక, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ ఈబీ) జేడీ విజయమణికంఠ ఆదేశా ల మేరకు బుధవారం ఎస్‌ఈబీ, ఒడిశా పోలీసు లు సంయుక్తంగా దాడు లు నిర్వహించారు. దుర్గం, ఏకర్మ, మారంగి గ్రామాల్లో 1,200 లీటర్ల సారా, 47వేల లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఈబీ సీఐ అనీల్‌కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ కమిషనర్ కేపీ గోపాల్, ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో సిబ్బంది, ఆంధ్ర, ఒడిశా పోలీసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa