గుంతకల్ పట్టణంలో సచివాలయాలు ఏర్పడినప్పటి నుంచి, 32 వ వార్డుకు సచివాలయం లేక, 28వ వార్డు సచివాలయంలో విలీనమై ఉన్నది, కౌన్సిలర్ సుధాకర్ చాలా రకాలుగా ప్రయత్నాలు జరిపి, కృషిచేసి, ఎట్టకేలకు 32వ వార్డుకు, ప్రత్యేక సచివాలయం, తీసుకురావడం జరిగింది, 28వ వార్డు సచివాలయం నుంచి, 32 వ వార్డు విడిపోయిన సందర్భంగా, కౌన్సిలర్ సుధాకర్ కి, సచివాలయ అడ్మిన్ రాము, మరియు సచివాలయ సిబ్బంది, పూలమాలతో గురువారం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా, మున్సిపల్ చైర్మన్ బండి శేషన్న, మున్సిపల్ ఆర్ ఐ ఎర్రి స్వామి, పాల్గొన్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ సుధాకర్ మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాలు మాకు సేవ చేసినందుకు, సచివాలయం సిబ్బందికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa