పండుగ వచ్చిందంటే చిన్న షాపులు మొదలు పెద్దపెద్ద కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆమెజాన్ గ్రేట్ ఇండియా రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించింది. ఏటా రిపబ్లిక్ డే (గణతంత్ర దినం), ఇండిపెండెన్స్ డే, దసరా, దీపావళికి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లతో, ఆకర్షణీయమైన డీల్స్ ను ప్రకటిస్తుంటాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ నెల 16 నుంచి రిపబ్లిక్ డే సేల్ మొదలవుతుంటే.. మిగిలిన యూజర్లకు ఈ నెల 17న ప్రారంభం అవుతుంది. ఈ నెల 20 వరకు ఈ ప్రత్యేకమైన అమ్మకాల కార్యక్రమం కొనసాగుతుంది.
ఈ సేల్ కోసం అమెజాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టై అప్ అయింది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పైనా ఈ ఆఫర్ పొందొచ్చు. ఈ విడత ఐఫోన్ 13, 14 మోడళ్లపై మంచి డిస్కౌంట్లను ప్రకటించొచ్చని తెలుస్తోంది. అలాగే, వన్ ప్లస్, రెడ్ మీ, శామ్ సంగ్, షావోమీ ఫోన్లపైనా భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. కాకపోతే విడిగా ఒక్కో ఉత్పత్తిపై డిస్కౌంట్ డీల్స్ ను ఇంకా ప్రకటించలేదు.
అలాగే ల్యాప్ టాప్ లపైనా 40 శాతం వరకు, హెడ్ ఫోన్లు, నెక్ బ్యాండ్లపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎక్చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ, స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్లను అమెజాన్ ప్రకటించనుంది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ సైతం బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఈ నెల 15 నుంచి డిస్కౌంట్ సేల్ ను నిర్వహించనుంది. ఈ సేల్ 20వ తేదీన ముగుస్తుంది. అమెజాన్ నాలుగు రోజులు నిర్వహిస్తుంటే, ఫ్లిప్ కార్ట్ ఆరు రోజులు నిర్వహించనుంది. సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందు నుంచే డిస్కౌంట్ డీల్స్ అందుబాటులోకి వస్తాయి.