ఆమదాలవలస పట్టణంలోని కొత్తకోట వీధిలో నివాసముంటున్న కార్మికుడు పంచాది సుభాష్(52) చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వెంకయ్యపేటకుచెందిన సుభాష్ కుటుంబంతో కొత్తకోట వీధిలో ఉండి భవన నిర్మాణ పనులు చేస్తు జీవిస్తున్నాడు. ఈనెల 5న పూజారిపేట సమీపంలో భవనంపై అంతస్తు నుంచి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్ వై.కృష్ణ తెలిపారు.