పెనమలూరు వైసీపీ మ్మెల్యే కొలుసు పార్థసారథి కుటుంభాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇదిలావుంటే
కొలుసు పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. స్వగ్రామం మొవ్వ మండలం కారకంపాడులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెడ్డయ్య భౌతికకాయానికి నివాళి అర్పించి.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్ వెంట మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావులు ఉన్నారు.
కొలుసు రెడ్డయ్య యాదవ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఒకసారి మచిలీపట్నం ఎంపీగా పని చేశారు. ఒకసారి ఉయ్యూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కొలసు పార్థసారథి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2004లో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత పెనమలూరు నుంచి 2009, 2019లో విజయం సాధించారు. 2014లో మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్థసారథి మంత్రిగా కూడా పనిచేశారు.