కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం పంజాబ్‌లోని హోషియాపూర్‌లో కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి యాత్రలో నడుస్తుండగా ఓ వ్యక్తి సెక్యూరిటీని తప్పించుకుని రాహుల్‌గాంధీ దగ్గరకొచ్చి కౌగలించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa