బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని అధిష్టానం పొడిగించింది. 2024 జూన్ వరకూ ఆయన పదవిలో కొనసాగుతారని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. నడ్డా అధ్యక్షతనే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో నడ్డా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చారన్నారు. ప్రధాని మోదీకి ప్రజాదరణ పెరగడంలో నడ్డా కూడా దోహదపడ్డారని కొనియాడారు.