21 ఏళ్ల వయసు నిండిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలనే నిబంధనను సవరించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వయసును మూడేళ్లు తగ్గించి 18 ఏళ్ల వారికి మద్యం విక్రయించేలా చట్ట సవరణ చేస్తోంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ రెండు రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు నెల రోజులు గడువు తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa