విశాఖ కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్ కు మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కాశిపట్నం సమీపంలోని శివలింగపురం వద్ద రైలు పట్టాలు తప్పడంతో ఒక భోగి పక్కకు ఒరిగింది. టోకో పైలట్ చకచకంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రైల్వే సిబ్బంది చేరుకొని మరమ్మతులు చేపడుతున్నారు. విశాఖ స్టేషన్ నుంచి మెడికల్ ఎమర్జెన్ సిబ్బంది ఘటన స్థలానికి బయలుదేరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa