ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 08:35 PM

రోడ్లపై సభలు, రోడ్ షోలు నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం ప్రతిపక్షాలపైనే ఈ అస్త్రాన్ని ప్రయోగించడం విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కూడా ఆయన సొంత నియోజకవర్గం పర్యటనకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు రోడ్ షోలు నిర్వహించడం విపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి స్టే విధించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com