యూపీలోని మధురలో చేపట్టిన బన్కే బీహారీ టెంపుల్ కారిడార్ పనులను వెంటనే నిలిపివేయించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్ కు మధుర ప్రజలు రక్తంతో లేఖ రాశారు. ఈ కారిడార్ వల్ల తమ ఇళ్లు పోయి వీధిన పడతామని, జీవనోపాధి కోల్పోతామని వాపోయారు. వెంటనే ఈ కారిడార్ ప్రతిపాదనను నిలిపివేసేలా చూడాలని కోరారు. అప్పటివరకూ ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.